
జీడిమెట్ల, వెలుగు : లోన్ యాప్వేధింపులు తట్టుకోలేక ఐటీ ఎంప్లాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాచుపల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వీరవర్ధన్(33), బాచుపల్లి కౌసల్య కాలనీలోని ఎస్ఎస్ కే అపార్ట్మెంట్లో ఉంటూ ఐటీ జాబ్ చేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నాడు. అతనికి జీతం తక్కువ, ఆర్థిక సమస్యలతో యాప్ లోన్ తీసుకున్నాడు.
సరిగా కట్టలేకపోతుండగా లోన్‌యాప్ వేధింపులు ఎక్కువయ్యాయి. భార్య డెలివరీ కోసం సొంతూరు వెళ్లగా ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. యాప్ లోన్ వేధింపులు తీవ్రమవడంతో ఫోన్సిచ్ఛాఫ్ చేశాడు. అయినా వదలని యాప్లోన్నిర్వాహకులు వీరవర్ధన్పెద్దమ్మకు ఫోన్‌చేసి అతని పరువు తీశారు. అతనికి పెద్దమ్మ చెప్పడంతో ఫేక్కాల్స్పట్టించుకోవద్దని సూచించాడు.
ఆమెతోపాటు అతని ఫోన్లోని పలు నంబర్లకు కాల్స్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.