
గచ్చిబౌలి, వెలుగు: వర్క్ ప్రెషర్ తట్టుకోలేక ఓ ఐటీ ఉద్యోగిని దుర్గం చెరువులో దూకింది. మాదాపూర్ పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని ఎస్ఆర్ నగర్ కు చెందిన జి.రోజా ఐటీ కారిడార్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపనీలో పని చేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం ఆఫీస్నుంచి నేరుగా కేబుల్ బ్రిడ్జి మీదకు చేరుకొని, దుర్గం చెరువులో దూకింది. పోలీస్పెట్రోలింగ్ సిబ్బందితోపాటు చెరువులో బోట్లో గస్తీ నిర్వహిస్తున్న రెస్క్యూ టీం ఆమెను కాపాడారు. బోటింగ్ సూపర్వైజర్ మనోహర్, డ్రైవర్ విష్ణు రోజాను ఒడ్డుకు చేర్చారు. పోలీసులు విచారణలో.. తాను వర్క్ప్రెషర్కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యానని, అందుకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపింది. అనంతరం ఆమెను ఓ ప్రైవేట్ఆసుపత్రికి తరలించారు.