ప్రముఖ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షో సక్సెస్ఫుల్ గా 3 సీజన్లు పూర్తీ చేసుకుని 4 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఇటీవలే 4వ సీజన్ ని షో నిర్వాహకులు గ్రాండ్ గా లాంచ్ చేశారు.
అయితే అన్స్టాపబుల్ షో 4వ సీజన్ మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 25న ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ కి గెస్ట్ గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇటీవలే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని కూడా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ALSO READ | పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నారా..?
అన్స్టాపబుల్ షో 4వ సీజన్ మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 25న స్ట్రీమింగ్ అవుతుండటంతో హైదరాబాద్ లోని కొందరు ఐటీ ఉద్యోగులు పలు చోట్ల వినూత్నంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రమోట్ చేశారు. ఈ క్రమంలో అక్టోబర్ 25ని బాలయ్య పండుగగా ప్రకటించాలని అలాగే ఆరోజున ఉద్యోగులందరికీ నేషనల్ హాలిడే ఇవ్వాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు.
దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ప్రమోషన్స్ లో భాగంగానే అన్స్టాపబుల్ షో నిర్వాహకులు ఇలా క్యాంపైన్ నిర్వహించి ఉంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే బాలయ్య బాబు పండుగ ఇదెప్పుడు పెట్టారు అంటూ బ్రమ్మి ఫన్నీ ఏమోజీస్ పెట్టి కామెంట్లు చేస్తున్నారు.