విప్రో ఆస్తుల అమ్మకం.. రూ.266 కోట్ల డీల్

విప్రో ఆస్తుల అమ్మకం.. రూ.266 కోట్ల డీల్

విప్రో.. ఈ మాట వినగానే ఐటీ కంపెనీ గుర్తుకొస్తుంది.. విప్రో అనగానే సబ్బులు, షాంపూలు, డైపర్స్ గుర్తుకొస్తాయి.. ప్రపంచ టాప్ ఐటీ కంపెనీల్లోనే ఒకటిగా గుర్తింపు పొందిన విప్రో కంపెనీ.. ఇప్పుడు మరో రకంగా వార్తల్లో ట్రెండ్ అవుతుంది. ఈ సంస్థ చెన్నై సిటీలో తమకున్న 14 ఎకరాల్లో ఉన్న బిల్డింగ్ తోపాటు.. స్థలం మొత్తాన్ని అమ్మేసింది. 266 కోట్ల రూపాయలతో డీల్ సెట్ చేసుకుంది. విప్రో కంపెనీ చెన్నైలోని తన 14 ఎకరాల క్యాంపస్ అమ్మేయటం చర్చనీయాంశం అయ్యింది. 

చెన్నైలోని 20 ఏళ్ల క్రితం నుంచే ఈ స్థలం విప్రో దగ్గర ఉంది. ఈ 14 ఎకరాల భూమిలో.. ఓ పెద్ద పాత భవనం కూడా ఉంది.  ఇప్పుడు ఈ 14.2 ఎకరాల భూమిని రూ. 266.38 కోట్లకు విక్రయించినట్లు ప్రకటించింది. ఈ ఆస్తులను కాసా గ్రాండ్ బిజ్‌పార్క్ అనే ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ దక్కించుకుంది. ఈ ఆస్తి చెన్నైలోని షోలింగనల్లూర్‌లోని విప్రో స్ట్రీట్‌లో ఉంది. ఈ ఆస్తుల విక్రయం జరిగిన అనంతరం విఫ్రో షేర్లు వరుస నష్టాలను చవిచూశాయి.

Also Read :- ఇంక 4 రోజులే.. రూ.2 వేల నోట్ల డిపాజిట్​కు గడువు

మరో విశేషం ఏంటంటే.. ఈ స్థలం ఉన్న ఏరియాతోపాటు ఆ వీధికి విప్రో స్ట్రీట్ అనే పేరుంది. అంత పాపులర్ ఇది. విప్రో అలాంటి అంతర్జాతీయ సంస్థ.. చెన్నై లాంటి మహానగరంలోని 14 ఎకరాల భూమిని అమ్మటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి ఆలోచనే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కూడా వచ్చింది. దీంతో సెప్టెంబర్ 26వ తేదీ ట్రేడింగ్ లో.. విప్రో షేర్లు నష్టాలను చవిచూశాయి. ఐదు రోజుల్లోనే 5 శాతం నష్టపోయాయి. ఇవన్నీ ఇలా ఉంటే..విప్రో ఈ స్థలాన్ని ఎందుకు అమ్మింది.. కారణాలు ఏంటీ.. విప్రో సంస్థ ఆర్థిక నష్టాల్లో ఉందా.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందా ఏంటీ అనే ప్రచారం సైతం జరుగుతుండటం విశేషం.