స్కిల్ అప్​ ఇండియా 4.0 షురూ

స్కిల్ అప్​ ఇండియా 4.0 షురూ

హైదరాబాద్​, వెలుగు: జాతీయ సాంకేతిక విద్యా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న నెక్స్ట్ వేవ్ సంస్థ.. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థతో (ఎన్ ఎస్ డీ సీ) కలిసి కీలక నిర్ణయం తీసుకుంది. యువతలో టెక్ నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్ అప్ ఇండియా 4.0 ను విజయవంతంగా ప్రారంభించినట్లు ప్రకటించింది. యువతకు టెక్నాలజీలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపింది. ఏఐ, ఎంఎల్, ఫుల్ స్టాక్ డెవలప్ మెంట్ వంటి అధునాతన టెక్నాలజీలను నేర్పిస్తారు.  

ఈ వినూత్న కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందనున్నారు. దీంతో వారు ఉపాధి కూడా పొందుతారు.   దేశవ్యాప్తంగా 3000కు పైగా కాలేజీల్లో 
కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 

మరిన్ని వార్తలు