- ఫేక్ బిల్లుల దందా రూ.2కోట్లకు పైనే?
- సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టివేసే కుట్రలో ఇద్దరు సూత్రధారులు
- హాస్పిటల్స్ ఓనర్లతో కలిసి వ్యవహారం
- ఓ ముఖ్యనేత పీఏ సహకారం?
- ఆఫీసర్ల మొక్కుబడి తనిఖీలతో దందా కంటిన్యూ
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా పాలకీడు మండలం చెర్వు తండా గ్రామ పంచాయతీకి చెందిన ఇద్దరు వ్యక్తులు సీఎంఆర్ఎఫ్(చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్) నుంచి నిధులు కొట్టేయడానికి ఫేక్ బిల్లుల దందాకు తెరతీసినట్లు తెలిసింది. కొన్నేళ్లుగా ఈ ఫేక్ బిల్లుల దందాను సాగిస్తుండగా ఎట్టకేలకు సీసీఎస్(సెంట్రల్ క్రైం స్టేషన్)లో కేసు నమోదుతో ఈ బాగోతం బయటపడింది. పాలకీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాలకు చెందిన సుమారు 200 నుంచి 250 మంది పేరి ట సదరు ఇద్దరు సూత్రధారులు .. ఫేక్ బిల్లులను తయారు చేసి సుమారు రూ. 2 కోట్లకుపైగా ఫ్రాడ్ చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ మల్టీ స్పెషాలిటీ, కోణార్క్, సూర్యతేజ హాస్పిటల్స్ ఈ ఫేక్ బిల్లుల వ్యవహారంలో సీజ్ కాగా అప్పటి వాటి ఓనర్లే నిర్వహిస్తున్న మహేశ్ మల్టీ స్పెషాలిటీ లో సీఎంఆర్ఎఫ్ ఫేక్ బిల్లుల దందా తెరపైకి వచ్చింది. 70 నుంచి 80శాతం ఫేక్ బిల్లులను ఈ హాస్పిటల్స్ ఓనర్ల సహకారంతోనే సదరు ఇద్దరు సూత్రధారులు పొంది.. సీఎంఆర్ఎఫ్ పైసలను కాజేసినట్లు తెలుస్తోంది. ప్రతీ బిల్లులో రూ. 20వేల నుంచి 30 వేలు హాస్పిటల్ ఓనర్స్ వాటాగా తీసుకుంటూ .. దందాను కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం దందా వెనుక ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత పీఏ సహకారం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పేరు మార్చి దందా..
పేదలకు వరంగా మారిన సీఎంఆర్ఎఫ్(ఎల్ఓసీ) స్కీంలో ఫేక్ మెడికల్ బిల్లుల వ్యవహారం మాయని మచ్చగా మిగిలింది. ఫేక్ బిల్లుల దం దాలో ఓ సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చెల్లెలు పేరు .. భూక్య జ్యోతి కాగా ఆమె పేరును బానావత్ జ్యోతిగా మార్చటం, ఫొటోను మాత్రం కుమార్తెది పెట్టి బిల్లులు కాజే సిన విషయం వెలుగులోకి రావటం హాట్ టాపిక్ గా మారింది. కాగా ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో నిర్వహించాల్సిన ఇన్ పేషెంట్స్, ఔట్ పేషెంట్స్, ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ డిటైల్స్, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రిజిస్టర్ సహా ఇతర రిజిస్టర్లను డీఎంవో స్థాయి ఆఫీసర్ చెక్ చేయా ల్సి ఉంటుంది. అయితే మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో మొక్కుబడి చెకింగ్లు చేస్తుండడంతో అక్రమార్కులకు అదనుగా మారి ఫేక్ బిల్లుల దందా జోరుగా నడిపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
విచారణ స్పీడప్..
ఫేక్ మెడికల్ బిల్లుల దందా వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు మెడికల్ ఆఫీసర్లు, సీఎంఆర్ఎఫ్ ఆఫీసర్లు విచారణ స్పీడప్ చేస్తున్నారు. ఈ నెల 10న డీఎంహెచ్‌వో, సంబంధిత ఆఫీసర్లు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను తనిఖీ చేయనున్నారని లోకల్ ఆఫీసర్లు చెప్పారు.