రాష్ట్రంలో ఉదయం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు

రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.  రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా కొమరంభీం జిల్లా కెరమెరిలో 36 మిల్లీమీటర్లు, నార్నూర్‎లో 27 మిల్లీమీటర్లు, బరంపూర్‎లో 22 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. 

ఈ రోజు, రేపు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి తక్కువ ఎత్తున గాలులు వీస్తున్నాయని తెలిపింది. రానున్న మూడు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది.  

నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుంది. నిజామాబాద్, డిచ్ పల్లి, ఆర్మూర్, ఇందల్ వాయి, దర్పల్లి, సిరికొండ మండలాల్లో ఉదయం నుంచే వర్షం పడుతోంది. ఈ నెల 12న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు ఉదయం నుంచి వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం జిల్లాల్లో వర్షం పడుతోంది. ఆదిలాబాద్ జిల్లా లోకారిలో 32.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నార్నూర్‎లో 27, బరంపూర్‎లో 22 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కొమరంభీం జిల్లా కెరమెరిలో 36 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిర్పూర్ టిలో32.8, వాంకిడిలో 23, జైనూర్‎లో 17, లోనవెల్లిలో 14.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా దాస్తురాబాద్ 11.8, ఖానాపూర్ 10.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెల 13 వరకు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. 

For More News..

ప్లేట్​ దోసె 2, ఇడ్లీ 3, ఊతప్పం 4 రూపాయలు

న్యూఇయర్‌‌‌‌ కోసం ఓయోలో భారీగా రూమ్ బుకింగ్స్