ఏటీఎంల్లో డబ్బులు రావట్లేదా..? బ్యాంక్ ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.7 కోట్లు.. 45 రోజులుగా గోదాముల్లోనే..

ఏటీఎంల్లో డబ్బులు రావట్లేదా..? బ్యాంక్ ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.7 కోట్లు.. 45 రోజులుగా గోదాముల్లోనే..

పద్మారావునగర్, వెలుగు: బ్యాంక్ ​ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.7 కోట్లను ఏజీఎస్ ట్రాన్సాక్ట్, సెక్యూర్​వాల్యూ వాల్ట్ ఏజెన్సీలు 45 రోజులుగా తమ వద్దే ఉంచుకున్న విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది. రెండు ఏజెన్సీలు రూ.7 కోట్లను గోదాముల్లో ఉంచినట్లు తెలిసింది. ఏజీఎస్​ట్రాన్సాక్ట్​టెక్నాలజీస్, సెక్యూర్ వాల్యూ వాల్ట్ ఏజెన్సీలు సిటీలోని ప్రముఖ బ్యాంకుల క్యాష్​ను వాటి ఏటీఎంలలో పెడుతుంటాయి. అయితే ఈ ఏజెన్సీల్లో పనిచేసే ఉద్యోగులు కొందరు జీతాలు రావడం లేదంటూ ఇటీవల విధులు బహిష్కరించారు. దీంతో ఏజెన్సీలు ఏటీఎంలకు క్యాష్​ పంపడం ఆగింది.

దాదాపు 45 రోజులుగా చాలా ఏటీఎంలకు క్యాష్​ వెళ్లడం లేదు. ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన రూ.5 కోట్లు, మరో బ్యాంకుకు సంబంధించిన రూ.కోటి80లక్షలు ఏజెన్సీల గోదాముల్లోనే ఉండిపోయాయి. ఏజెన్సీల నిర్వాహకులతో బ్యాంకులు పలుమార్లు మాట్లాడినా ఎలాంటి స్పందన లేదు. దీంతో ఓ బ్యాంక్​అధికారి శనివారం బోయిన్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు ఏజెన్సీలపై పోలీసులు కేసు నమోదు చేశారు.