-
త్వరలో ఇండస్ట్రియల్ పార్క్ కు శంకుస్థాపన
-
మహిళల స్వావలంబన కోసం ఇందిరా డైరీ
-
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం: జిల్లాలోని మధిరకు త్వరలో ఐటీ హబ్ తీసుకువస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇవాళ మధిర క్యాంపు కార్యాలయంలో మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఐటీ హబ్ ఏర్పాటుకు కావలసిన భూమిని గుర్తించామన్నారు. మధిరలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా నని పేర్కొన్నారు. మధిర మండలం ఎండ్లపల్లిగుట్ట వద్ద ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు త్వరలో శంకుస్థాపన చేస్తున్నామన్నారు. యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించడానికి ఎంఎస్ ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ తీసుకువచ్చామన్నారు.
పరిశ్రమలు పెట్టుకునే యువతకు ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. ట్రెడిషనల్ వ్యాపారాన్ని పారిశ్రామికరణ చేసి ఉత్పత్తి వినియోగం పెంచడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఇందిరా డైరీ ఏర్పాటురే కసరత్తు నడుస్తున్నదన్నారు. పాల ఉత్పత్తి, ప్యాకింగ్, మార్కెటింగ్ లను ఇందిరా డైరీ నిర్వహించబోతుందని డిప్యూటీ సీఎం చెప్పారు