ఇది ఊసరవెల్లి కప్ప

ఇది ఊసరవెల్లి  కప్ప

వాషింగ్టన్: శత్రువుల బారి నుంచి తప్పించుకునేందుకు ఊసరవెల్లి లాగా ఈ కప్ప తన శరీర రంగును మార్చి పూర్తి పారదర్శకంగా మార్చుకుంటది. ఈ కప్పను ‘టైనీ గ్లాస్  ఫ్రాగ్’  అంటారు. ఆకారంలో ఇవి చిన్నగా ఉంటాయి. రాత్రి పూట ఇవి తమ ఎర్రరక్త కణాలను మార్చి పూర్తిగా ట్రాన్స్ పారెంట్ గా మారిపోతాయి. శరీరంలో రంగురంగులుగా ఉండే ప్రాంతాన్ని కాలేయంలోకి ఇముడ్చుకుంటాయి. ఇక పగటిపూట ఇవి చెట్ల ఆకుల అడుగు భాగాన వేలాడుతూ, ఆ ఆకుల రంగులో కలిసిపోతాయి. ఎంతగా అంటే శత్రువుల కంటికి కనిపించనంతగా ఆకుల రంగులోకి మారిపోతాయి. దీంతో శత్రువులు ఈ కప్పలను గుర్తించడం చాలా కష్టంగా మారిపోతుంది.

చెట్లకు వేలాడుతూ ఉన్నపుడు ఆ కప్పల నీడ కూడా భూమిపై పడకపోవడం విశేషం. అమెరికాలోని డ్యూక్  యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ఈ టైన్  గ్లాస్ ఫ్రాగ్ లపై  పరిశోధన చేసి ఈ విషయాలను కనుగొన్నారు. ఈ కప్పలు మెలకువగా ఉన్నపుడు వాటి శత్రువుల బారి నుంచి సులభంగా తప్పించుకోగలవని ఆ వర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. నిద్రపోతున్నపుడు శత్రువుల బారినపడే ప్రమాదం ఉండడంతో రంగులను మార్చి పారదర్శకంగా మారిపోతాయని వివరించారు. లైట్  అండ్  అల్ట్రా సౌండ్  ఇమేజింగ్  టెక్నాలజీని వాడి ఈ కప్ప సంగతుల గురించి తెలుసుకున్నామని వారు వెల్లడించారు.