అంతరిక్ష యాత్రలో ఉన్న భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ పై ఇస్రో చీఫ్ ఎస్.సోమ్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతరిక్షం నుంచి సునీ తా విలియమ్స్ బృందం రాక ఆలస్యంపై ఓ ఇంటర్వూలో ఆయన ఆసక్తి కర విషయాలను వెల్లడించారు. సునీతా విలియమ్స్ బృందం రాకపై పెద్దగా ఆందోళన చెందా ల్సిన అవసరం లేదు.. త్వరలోనే వ్యోమగాములు హోంప్లేస్ కు చేరుకుంటారని అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చాలా సేఫ్ ప్లేస్..సుదీర్ఘ కాలం అక్కడ మానవులు జీవించే సదుపాయం ఉందన్నారు సోమ్ నాధ్..
ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష సెంటర్ లో మొత్తం తొమ్మిది మంది వ్యోమగాములున్నారు. వారంతా త్వరలోనే తిరిగి వస్తారు. బోయింగ్ స్టార్ లైనర్ అనే కొత్త క్రూ మాడ్యుల్ ను పరీక్షిస్తున్నారు. అది తిరిగి హోం ప్లేస్ కు చేరుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు సోమ్ నాథ్. ఇది సమస్య కాదు..ఐఎస్ఎస్ చాలా కాలం పాటు ప్రజ లు నివసించేందుకు సురక్షితమైన ప్రాంతమే అని ఇస్రో చీఫ్ సోమ్ నాథ్ అన్నారు.