రాహుల్ వద్దు. ఓపెనర్ గా ఇషాన్ బెస్ట్: గంభీర్

రాహుల్ వద్దు. ఓపెనర్ గా ఇషాన్ బెస్ట్: గంభీర్

గతంలో జరిగిన సిరీస్ లు, తాజాగా నిర్వహించిన ఐసీసీ టోర్నమెంట్లలో టీం ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఏవిధంగా ఫెయిల్ అయ్యాడో అందరికీ తెలిసిన విషయమే. అయితే, తనపై ఇప్పటివరకు మాజీ ప్లేయర్ గానీ, సెలక్షన్ కమిటీగానీ ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఈ విషయంపై భారత మాజీ ఆటగాడు ఓపెనర్ గౌతమ్ గంభీర్ మొదటిసారి స్పంధించాడు. వన్డేల్లో ఓపెనర్ గా రాహుల్ బదులుగా ఇషాన్ కిషన్ ని ఆడించాలని అభిప్రాయపడ్డాడు.  

‘వరుసగా విఫలం అవుతున్న రాహుల్ స్థానాన్ని, ఓపెనర్ స్లాట్ ని భర్తీ చేసేందుకు ప్రస్తుతం ఇషానే సరైనవాడు. ఇషాన్ చాలా సేపు బ్యాటింగ్ చేయగలడు. ఆ తర్వాత స్థానాల్లో విరాట్, సూర్య, శ్రేయస్, హార్దిక్ ఉంటారు. రాహుల్ బ్యాకప్ బ్యాటర్ గా పనికొస్తాడు. కీపర్ గా కూడా ఎంచుకోవచ్చు’ అని చెప్పాడు. గాయం కారణంగా సిరీస్ కు దూరమైన రోహిత్ స్థానంలో వచ్చిన ఇషాన్, ఓపెనింగ్ స్థానాన్ని భర్తీ చేస్తూ 35 ఓవర్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. ఈ సిరీస్ మొత్తం రాహుల్ ఫెయిల్ అయ్యాడు. ఈ కారణాలతో టీం ఇండియా వైస్ కేప్టెన్ నుంచి కూడా రాహుల్ ని తొలగించారు. ఆ భాద్యతలు ఇప్పుడు హార్ధిక్ పాండ్య మోయనున్నాడు.