- ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ స్పష్టతనివ్వలి
- డేటా ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలి
- మేనిఫెస్టో అమలు చేయకపోతే ఉద్యమం
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సూర్యాపేట, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలేదని, ఇప్పుడే విమర్శించడం సరైన పద్ధతి కాదని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సూర్యాపేటలో నల్లగొండ పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పులు రిపీట్కాకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని అర్థమవుతున్నదన్నారు.
గ్యారంటీల పేరుతో ప్రభుత్వం డేటా ఎందుకు సేకరిస్తున్నారో ప్రజలకు ెప్పాలన్నారు. ఒకవేళ పార్టీ ప్రయోజనాల కోసమే ఈ పని చేస్తున్నట్టయితే బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే సహకరిస్తామని, తప్పు చేస్తే ఎత్తి చూపుతామన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేయకపోతే ఉద్యమిస్తామన్నారు.
సూర్యాపేట అసెంబ్లీ అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కొండ భీమయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ స్టాలిన్, నకిరేకంటి వెంకన్న, ఇరుగు నవీన్, పిడమర్తి ఉపేందర్ గట్టు గోపి, బయ్య లింగయ్య యాదవ్, మహిళా కన్వీనర్ లలిత, కళ్యాణి సరిత పాల్గొన్నారు.