క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు: పీసీసీ చీఫ్

క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు: పీసీసీ చీఫ్

హైదరాబాద్: క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బండి సంజయ్ విజ్ఞ తతో మాట్లాడితే మంచిదన్నారు. పార్ములా ఈ రేస్ అంశాన్ని తెలుసుకొని మాట్లాడలని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఐక్యత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మరోమారు బయటపడిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చేసిన పనులపై చర్చకు సిద్ధమని తెలిపారు. వాళ్లు పదేండ్లలో భర్తీ చేసిన ఉద్యోగాలను తాము ఏడాదిలో ఇచ్చినట్టు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కొలువులు ఇవ్వబోతున్నామని వివరించారు.