జేపీఎస్​లను బెదిరించడం సరైంది కాదు

జేపీఎస్​లను బెదిరించడం సరైంది కాదు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జేపీఎస్​లను రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వం బెదిరింపులకు దిగడం సరైందికాదని డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో జేపీఎస్ ల ఆందోళనకు మద్దతు తెలిపారు. సీఎం తన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.


మహబూబ్ నగర్ టౌన్: జేపీఎస్​ల డిమాండ్లు నేరవేర్చేంత వరకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి తెలిపారు. పట్టణంలోని ధర్నా చౌక్  వద్ద జేపీఎస్​లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపారు. జేపీఎస్​లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణవర్దన్ రెడ్డి, ఎ.అంజయ్య, సుబ్రహ్మణ్యం, సతీశ్ కుమార్, రాజుగౌడ్, రాజశేఖర్, చంద్రశేఖర్, వెంకటేశ్​ పాల్గొన్నారు.  
గద్వాల: పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లను నెరవేర్చకుండా, ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించడం సరైంది కాదని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్  రామాంజనేయులు, టౌన్  ప్రెసిడెంట్ బండల వెంకట్రాములు అన్నారు. జేపీఎస్ ల నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించారు. శ్రీనివాస్ గౌడ్, శ్రీను, అంజి పాల్గొన్నారు.


ఉప్పునుంతల(వంగూరు): జేపీఎస్​లకు విధుల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం నోటీసు ఇవ్వడంపై బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్​యాదవ్  ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో జేపీఎస్​లకు మద్దతుగా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికే ఉద్యమకారుల ఉసురు పోసుకుందని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

ప్రభుత్వం తీరుపై ఆగ్రహం

అయిజ: హక్కుల సాధన కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జేపీఎస్​లను విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని  డెడ్ లైన్ విధించడంపై బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్  వ్యవస్థ ఉండదని, అందరినీ రెగ్యులరైజ్  చేస్తామని చెప్పి ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నరసింహయ్యశెట్టి, ప్రదీప్ కుమార్, భగత్ రెడ్డి, వెంకటేశ్​యాదవ్, లక్ష్మణ్ గౌడ్, ఆది, రఘు ,రాజశేఖర్  పాల్గొన్నారు.