భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ను ఫోన్ చేసి బెదిరించడం సరికాదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇలాంటి చర్యలకు కోమటిరెడ్డి పాల్పడడం తగదని చెప్పారు. చెరుకు సుధాకర్ ఈ అంశంపై పీసీసీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. తాము కూడా ఈ అంశాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లామని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు
బీఆర్ఎస్ సర్కార్ పై ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తమ కష్టాలు తొలగుతాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. అందుకే కాంగ్రెస్ చేపట్టిన హత్ సే హత్ జోడో పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. ఈనెల 9న కరీంనగర్ లో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన.. ఈ సభకు ముఖ్య అతిథిగా ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్ హాజరుకానున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగానే కరీంనగర్ లో సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు.