ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో గత పది రోజులుగా నెలకొన్న సస్పెన్స్కు బీజేపీ అధిష్టానం ఎట్టకేలకు తెరదించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరును బీజేపీ కోర్ కమిటీ బుధవారం(డిసెంబర్ 4, 2024) ఫైనల్ చేసింది. ముంబైలోని విధాన్ భవన్ సెంట్రల్ హాల్లో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ను ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.
— ANI (@ANI) December 4, 2024
ఫడ్నవీస్ను బీజేపీ శాసనసభా పక్ష నేతగా బీజేపీ పెద్దలు విధాన్ భవన్ సెంట్రల్ హాల్ సాక్షిగా ప్రకటించారు. ఈ ప్రకటనపై మహాయుతి కూటమి ఎమ్మెల్యేల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. శాసనసభా పక్ష నేతనే ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఎప్పుడూ జరుగుతుంటుంది. మహారాష్ట్రలో కూడా ఇప్పుడు అదే జరగబోతోంది. బీజేపీ అధిష్టానం నుంచి వచ్చిన దూతలు చేసిన ప్రకటనతో దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటి ముందు బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో చీఫ్ విప్గా ఆశిష్ షెలార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ డిసెంబర్ 5న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని ఆజాద్ మైదాన్ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదిక కానుంది. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అధికారిక ఆహ్వాన పత్రిక కూడా విడుదలైంది. ఈ ఆహ్వాన పత్రికలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అని మెన్షన్ చేయడం గమనార్హం. గతంలో రెండుసార్లు సీఎంగా, ఒకసారి డిప్యూటీ సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పనిచేశారు. ఇదిలా ఉండగా.. ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ కూడా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది.
— ANI (@ANI) December 4, 2024
బీజేపీ హైకమాండ్ నిర్ణయం మేరకు.. సీఎం పదవితోపాటు కీలకమైన హోం శాఖను కూడా ఆ పార్టీ తన వద్దే ఉంచుకోనుందని, ఎన్సీపీకి ఫైనాన్స్, శివసేనకు పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ శాఖలను అప్పగించనుందని తెలుస్తోంది. కేబినెట్లో బీజేపీకి 22 బెర్తులను ఉంచుకుని, శివసేనకు 12, ఎన్ సీపీకి 9 మంత్రి పదవులను ఇవ్వనున్నట్టు చెప్తున్నారు. అయితే, తొలుత డిప్యూటీ సీఎం పదవికి ఒప్పుకోని షిండే.. తనకు డిప్యూటీ సీఎంతో పాటు హోం శాఖను కూడా ఇస్తే ఓకే అని చెప్పినట్టు పేర్కొంటున్నారు.
— ANI (@ANI) December 4, 2024