విభజన హామీలు పొందడం మా హక్కు

విభజన హామీలు పొందడం మా హక్కు
  • కేంద్రాన్ని బిచ్చం అడగడం లేదు: ఎంపీ రేణుకా చౌదరి

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు పొందడం తెలంగాణ హక్కు అని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని తామేమీ బిచ్చమడగడం లేదని... హక్కు కాబట్టి నిలదీస్తున్నట్లు చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలనే నేరవేర్చకపోతే, ఇంకా ఈ సమావేశాలు నిర్వహించుకోవడం ఎందుకని ఫైర్ అయ్యారు.

 మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో కాంగ్రెస్ నుంచి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ... సౌత్ స్ట్రేట్ పై కేంద్రం చిన్న చూపు చూస్తోందని విమర్శించారు. తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీకి అధికారం ఇవ్వడం లేదని తెలిపారు. 

అంతమాత్రాన ఆ రాష్ట్రాలకు నిధులు ఇవ్వరా? అని ప్రశ్నించారు. విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు కర్మాగారం, హార్టికల్చర్ యూనివర్సిటీ, సెంట్రల్ హార్టికల్చర్ యూనివర్సిటీ, పాలమూరు–రంగారెడ్డికి నేషనల్ స్టేటస్, పెద్దపల్లిలో ఎన్టీపీసీ తెలంగాణ సూపర్‌‌‌‌ థర్మల్‌‌‌‌ విద్యుత్ కేంద్రం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 

జోగులాంబ ఆలయ పనుల్లో స్పీడ్ పెంచండి: డీకే అరుణ 

ప్రసాద్‌‌‌‌ స్కీం కింద మహబూబ్‌‌‌‌ నగర్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ నియోజకవర్గంలోని అలంపూర్‌‌‌‌ జోగులాంబ ఆలయ అభివృద్థి పనులను వేగవంతం చేయాలని కేంద్రప్రభుత్వానికి ఎంపీ డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. జోగులాంబ ఆలయం దేశంలోని 18 శక్తి పీఠాల్లో ఒకటని, దక్షిణాది కాశీగా కూడా ప్రసిద్థి చెందిందన్నారు. మంగళవారం లోక్‌‌‌‌సభలో రూల్‌‌‌‌ 377 కింద ఈ అంశాన్ని ప్రత్యేకంగా లేవనెత్తారు.