మళ్లీ షురూ.. హైదరాబాద్లో భారీ వర్షం..

హైదరాబాద్ సిటీలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి మబ్బులతో ఉన్న ఆకాశం ఉన్నట్టుండి  గర్జించింది. గురువారం ( సెప్టెంబర్5, 2024) సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బషీర్ బాగ్, నారాయణగూడ, అబిడ్స్, కోఠి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఎల్బీ నగర్,వనస్థలిపురం,హయత్ నగర్,నాగోల్ ప్రాంతాల్లో మోస్తరుగా వర్షం పడుతోంది. 

మరోవైపు సిటీ లోని బోడుప్పల్ ,పీర్జాదిగూడ, ఉప్పల్ ప్రాంతాలలో కూడా వర్షం కురుస్తోంది. దిల్ షుఖ్ నగర్,కొత్త పేట,మలక్ పేట,చంపాపేట,చాదర్ ఘాట్ ప్రాంతా ల్లో సాయంత్రం నుంచేవర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, మెహదీపట్నంలో కూడా వర్షం పడుతోంది. 

రానున్న రెండు గంటల్లో సిటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.. రోజు సాయంత్రం వేళ్లల్లో వర్షాలు పడుతున్నాయి.హైదరాబాద్ నగరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి సూచిస్తుంది.