హైదరాబాద్‎లో ముసురు .. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి..!

హైదరాబాద్‎లో ముసురు .. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి..!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎లో ముసురు వాన పడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదివారం (డిసెంబర్ 8) తెల్లవారుజూము నుంచి నగరంలో పలు చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి. నగరంలోని రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలర్ దేవ్ పల్లి, బండ్లగూడ జాగర్, కిస్మత్పూర్, హిమాయత్ సాగర్, నార్సింగి, గండిపేట్ మణికొండ పుప్పాలగూడ, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, లక్డీకపూల్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి.

 బండ్లగూడ జాగర్ కార్పొరేషన్‎లో.. చిరు జల్లులకు రోడ్లన్నీ బురదమయమయ్యాయి. ఉదయాన్నే వర్షం కురుస్తుండటంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో పొగ మంచు అలుముకుంది. రోడ్లపై పొగ మంచు దట్టంగా అలుముకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.  అల్ప పీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే పడొచ్చని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రభుత్వ యంత్రాగం అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేసింది.