కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో గుప్తనిధుల కలకలం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో గుప్తనిధుల కలకలం
కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో గుప్తనిధుల కలకలం రేగింది. రంగనాయకుల గుట్ట వద్ద ఓ రైతుకు గుప్తనిధి దొరికిందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గుట్ట వద్ద భూమి చదును చేస్తున్న రైతుకు పురాతన కుండ లభించింది. కుండలో గుప్తనిధి ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. విషయం కాస్త బ‌య‌ట‌కు తెలియ‌డంతో క‌ల‌క‌లం రేగింది. దీని గురించి తెల‌సుకున్న‌ రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. రైతు రాజిరెడ్డితో మాట్లాడి భూమిలో కుండ ల‌భించిన తీరును అడిగి తెలుసుకున్నారు. పురావస్తుశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విచారణ నిర్వహించేందుకు వారు గ్రామానికి చేరుకుంటున్నారు. రైతు నుంచి పూర్తి వివరాలు సేకరించిన తరువాత అన్ని విషయాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.