ములుగు, వెలుగు: ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. ములుగు టౌన్ పరిధి బండారుపల్లి రోడ్డులోని ఓ వెంచర్లో డెడ్ బాడీ ఆదివారం ఉదయం స్థానికులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెళ్లి పరిశీలించగా.. డెడ్ బాడీపై రక్తం మరకలు ఉండటం, బండరాళ్లతో కొట్టి మర్డర్చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ములుగు ఇన్చార్జి సీఐ జి.రవీందర్, ఎస్ఐ వెంకటేశ్వర్రావు, లక్ష్మారెడ్డి మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఘటనా స్థలంలో డాగ్స్వ్కాడ్తో విచారణ చేపట్టారు. డెడ్ బాడీ సమీపంలో మద్యం, కల్లు బాటిల్ దొరకడంతో చనిపోయిన వ్యక్తితో పాటు మరొకరు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు.
మృతుడి డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఓర్సు శ్రీనివాస్(40), సొంతూరు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల వాసిగా గుర్తించారు. అతను భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన లింగారావు వద్ద ఇసుక టిప్పర్డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఓనర్లింగారావును విచారించగా మూడు రోజుల కింద డ్యూటీ దిగిన శ్రీనివాస్ఇంటికి వెళ్తున్నానని చెప్పినట్టు తెలిపాడు. శ్రీనివాస్ భార్యను రప్పించి డెడ్ బాడీని మార్చురీకి తరలించారు. మృతుని తల్లిదండ్రులు వచ్చాకే పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలిసింది. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.