
న్యూఢిల్లీ: బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోన్న నిరుద్యోగులకు భారతదేశంలోని రెండు అతిపెద్ద ఐటీ సర్వీస్ కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్ గుడ్ న్యూస్ చెప్పాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఇంజనీరింగ్ కళాశాలల నుంచి వేలాది మందిని ఉద్యోగాల్లో నియమించుకుంటామని తెలిపాయి. ఎఫ్26లో 20 వేల మంది కొత్త ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తమ సంస్థల్లో నియమించుకుంటామని ఇన్ఫోసిస్ వెల్లడించింది.
టీసీఎస్ కూడా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా 42 వేల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. అయితే.. మరో ప్రముఖ ఐటీ సేవల కంపెనీ విప్రో మాత్రం.. డిమాండ్ ఆధారంగా తన క్యాంపస్ నియామక కార్యక్రమాన్ని చేపడతామని పేర్కొంది. ప్రాజెక్ట్ ర్యాంప్-అప్‌లు, ఇతర ఒప్పందాల ఆధారంగా కంపెనీలు ఈ రిక్రూట్మెంట్ చేపట్టే అవకాశం ఉంది.
Also Read:-ఇంటర్ అర్హతతో CSIR -NAL లో ఉద్యోగాలు..స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
కాగా, కరోనా మహమ్మారి తర్వాత ఒక సంవత్సరం పాటు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నాయి. ఈ ప్రభావంతో గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా ఈ కంపెనీల్లో నియామకాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా వరకు ఎంట్రీ-లెవల్ పనులు ఆటోమేటెడ్ మార్కెట్లోకి AI ఎంట్రీ ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలకు కోత పడింది.