గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనా కాలంలో పీఈటీలు అనేక ఇబ్బందులు పడ్డారని ఐటీ శాఖ మంత్రి దుదిళ్లు శ్రీధర్ బాబు అన్నారు. గోదావరిఖని సింగరేణి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్-17 వాలీబాల్ టోర్నమెంట్ ఆయన ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు మంత్రి శ్రీధర్ బాబు. ఆయనతోపాటు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, అర్జీ 1 జిఎం లలిత్ కుమార్, సి పి శ్రీనివాస్ లు హాజరైయ్యారు.
ALSO READ : తరుగు లేకుండా పంటను కొనుగోలు చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు
ఈ క్రీడా పోటీలలో తెలంగాణ ఉమ్మడి జిల్లాల వారీగా క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తుందని మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో యాంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీఈటీల సమస్యలు పరిష్కరించిందన్నారు. ఫిజికల్ డైరెక్టర్లు క్రీడాకారుల్లో మంచి నైపుణ్యాన్ని పెంపొందించాలని ఆయన సూచించారు.