డీకే.. ఇదేనా నీతి : ఫ్యాక్స్ కాన్ సీఈవోకు లేఖ బయటపెట్టిన కేటీఆర్

  • డీకే.. ఇదేనా నీతి
  • ఫ్యాక్స్ కాన్ సీఈవోకు లేఖ బయటపెట్టిన కేటీఆర్
  • ఇక్కడి కంపెనీని బెంగళూరుకు మార్చుమన్నారెందుకు
  • ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చాక ఫ్యాక్టరీలన్నీ తీసుకెళ్తారా
  • కర్నాటక ఉపముఖ్యమంత్రికి కేటీఆర్ కౌంటర్

హైదరాబాద్ : కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పై ఐటీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. డీకే శివకుమార్ ఫ్యాక్స్ కార్న్ కంపెనీ సీఈవోకు రాసిన లేఖను ఇవాళ బయటపెట్టారు. మనం ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఐటీ కంపెనీలను బెంగళూరుకు తరలించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కంపెనీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందుగానే ఆ సంస్థ సీఈవోకు డీకే శివకుమార్ లేఖ రాశారని, బెంగళూరుకు మార్చాలని కోరారని తెలిపారు. త్వరలోనే తెలంగాణలో ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుందని, అక్కడున్న ప్రముఖ కంపెనీలన్నీ బెంగళూరుకు మార్చేస్తామని అని పేర్కొన్నారని ఆరోపించారు. ఇది కర్నాటక ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర అని పేర్కొన్నారు. కేసీఆర్ లేకపోయినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోయినా ఇదే జరుగుతుందని అన్నారు. ఇక్కడి కాంగ్రెస్ లీడర్లకు బెంగళూరు అడ్డాగా మారిందని ఆరోపించారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే ఉద్యోగానూ బెంగళూరుకు తీసుకెళ్తారని విమర్శించారు. 

ఢిల్లీకి పెత్తనమిస్తే.. తెలంగాణ ఆగమే

ఢిల్లీకి పెత్తనం ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఆగమవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ జలవిహార్ లో నిర్వహించి న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో చేయగలిగినంత అభివృద్ధి చేశామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి అందరికీ కనిపిస్తున్నా.. కొందరు అబద్ధం చెబుతున్నారని అన్నారు. అభివృద్ధి చేయాలంటే ఖలేజా కావాలని అది కేసీఆర్ కు మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడి ఐటీ కంపెనీలకు బెంగళూరుకు తరలించడం ఖాయమని పేర్కొన్నారు. 

ఐటీ ఉత్పత్తుల్లో రూ. 2 లక్షల కోట్లకు పెంచినట్టు కేటీఆర్ చెప్పారు. వ్యవసాయాభివృద్ధిలో తెలంగాణ పంజాబ్, హర్యానాను మించి పోతోందని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. భాగ్యనగరం అంతర్జాతీయ నగరాల సరసన చేరిందని చెప్పారు. ఈ విషయాన్ని లెజెండ్ యాక్టర్ రజినీ కాంత్ అన్నారని, ఇది హైదరాబాదా..? న్యూయార్కా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారని చెప్పారు. బాలివుడ్ నటి సన్నిడియోల్ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందని చెప్పారని వివరించారు. సినీ తార లయ కూడా హైదరాబాద్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కన్న బాగుందని కితాబు ఇచ్చారని గుర్తు చేశారు.

ALSO READ :- కొచ్చిలో కూలిన చేతన్ హెలికాఫ్టర్