కొత్త సంవత్సరంలో పాత వాహనాలుండవు

కొత్త సంవత్సరంలో పాత వాహనాలుండవు

అత్యాధునిక వ్యవస్థలు, పద్ధతులు ఉపయోగించి స్వచ్ఛ హైదరాబాద్‌ను సాధిస్తామని ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన ఈ రోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్మాణ వ్యర్థాలు తరలించే 55 ఆధునిక కాంప్యాక్టర్ వాహనాలను ప్రారంభించారు. ఆ తర్వాత సంజీవయ్య పార్కు దగ్గర ఆధునిక చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను ఓపెన్ చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్‌లో దేశంలోనే హైదరాబాద్ ముందు ఉందన్నారు. వచ్చే కొత్త సంవత్సరంలో పాడైన చెత్త వాహనాలు ఉండవని, వాటి స్థానంలో ఆధునిక వాహనాలు ఇస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా పారిశుద్ధ్యానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పెద్ద‌పీట వేశార‌ని ఆయన అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

కాంప్యాక్టర్ వాహనాలతో భవన నిర్మాణాల వ్యర్థాలను తరలించనున్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ 50 వాహనాలను ఏర్పాటు చేస్తోంది. ఒక్కో వాహన సామర్థ్యం 20 క్యూబిక్ మీటర్లు కాగా…. అందులో 15 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించే అవకాశముంది. జీహెచ్ఎంసీ అధికారులు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కాంట్రాక్టు సంస్థ రాంకీ ఎన్వీరో ఆధునిక విధానాలను చేపడుతోంది.

For More News..

హైపర్‌లూప్‌లో ప్రయాణం చేసిన తొలి భారతీయుడు

రాష్ట్రంలో మరో 1,015 కరోనా కేసులు

కంటిచూపు పోగొట్టినందుకు దవాఖానకు 3 లక్షల పెనాల్టీ