ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌‌‌‌కు లేదు : శ్రీధర్ బాబు

నాంపల్లి, వెలుగు: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా బాధ్యత లు స్వీకరించిన ప్రొఫెసర్ ఆలేఖ్య పుంజాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తామంటే వద్దంటామా అని ప్రశ్నించారు. ఫిరాయింపులను ప్రోత్సహించాలని తాము అనుకోవడం లేదన్నారు. 

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారం లో ఉన్నప్పుడు కాంగ్రెస్‌‌‌‌ నాయకులను మభ్యపెట్టి వారి పార్టీలోకి చేర్చుకుందని, తాము అలా చేయడం లేదని పేర్కొన్నారు. భయపెట్టి అనేక రకాలుగా తమ ఎమ్మెల్యేలను అప్పుడు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ చేర్చుకున్నారని, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌‌‌‌లోకి చేరుతున్నారన్నారు. ప్రజా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు వస్తున్నారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిలో చెప్పిననవి చేస్తున్న కాంగ్రెస్‌‌‌‌లోకి పాత్రదారులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. చివరికి బీఆర్ఎస్‌‌‌‌లో మిగిలే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరో తేల్చుకోవాలన్నారు.

సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా  ఆలేఖ్య బాధ్యతలు..

రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా ప్రముఖ నాట్య గురువు, కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీ త ప్రొఫెసర్ ఆలేఖ్య పుంజాల శుక్రవారం హైదరాబాద్ రవీంధ్ర భారతి ప్రాంగణంలోని అకాడమీ చాంబర్‌‌‌‌‌‌‌‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి ఆమెకు పూలబొకె ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ తదితరులు హాజరై ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.