తెలంగాణను ప్రపంచ స్కిల్స్​ క్యాపిటల్​గా మార్చుతం :  ఐటీ మంత్రి శ్రీధర్​ బాబు

తెలంగాణను ప్రపంచ స్కిల్స్​ క్యాపిటల్​గా మార్చుతం :  ఐటీ మంత్రి శ్రీధర్​ బాబు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను ప్రపంచం స్కిల్స్​ క్యాపిటల్​ గా తీర్చిదిద్దుతామని, ఇందు కోసం ప్రతి జిల్లాలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఐటీ మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు. హైదరాబాద్​ను గ్లోబల్  కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) హబ్​గా మారుస్తామన్నారు. కాంగ్రెస్ ​ప్రభుత్వం.. విద్యార్థులకు నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నదని చెప్పారు.

కెనడాకు చెందిన కాన్​స్టెలేషన్​ సాఫ్ట్​వేర్​ ఐఎన్​సీ అనే సంస్థకు చెందిన డార్క్​మ్యాటర్​ టెక్నాలజీస్​ జూబ్లీహిల్స్​లో ఏర్పాటు చేసిన గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్​ను శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో  ట్యాలెంట్​కు కొదవ లేదని, తక్కువ పెట్టుబడితో అద్భుత ఆవిష్కరణలు చేసే సత్తా ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు జీసీసీలు ఊతమిస్తున్నాయన్నారు.

ఈ ఏడాది వాటి విలువ 4600 కోట్ల డాలర్లుగా ఉంటుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారన్నారు. త్వరలోనే క్వాంటమ్​ కంప్యూటింగ్​కు సంబంధించిన సెంటర్​ ఆఫ్​ ఎక్సలెన్స్​ను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.