ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలను డెవలప్ చేస్తం : మంత్రి శ్రీధర్ బాబు

ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలను డెవలప్ చేస్తం : మంత్రి శ్రీధర్ బాబు

ఘట్​కేసర్, వెలుగు : రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఉన్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం ఘట్​కేసర్​ మున్సిపల్ పరిధిలోని కొండాపూర్ లో ప్రభుత్వ బాలికల ఐటీఐ భవనాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. కంప్యూటర్, ఇతర ల్యాబ్​లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఐటీఐతోపాటు పాలిటెక్నిక్​కాలేజీలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్  సంస్థ సౌజన్యంతో రూ.8 కోట్లతో కొండాపూర్ లో ఐటీఐ బిల్డింగ్​నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం గురుకుల కాలేజీలో రూ.50 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వజ్రేశ్​ యాదవ్ తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. కాలేజీ మైదానంలో సీఎం కప్ టోర్నమెంట్​ను ప్రారంభించారు.

కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఘట్​కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ ఎం.పావని జంగయ్య యాదవ్, బి బ్లాక్ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మాజీ సర్పంచ్ యాదగిరి యాదవ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.