హైదరాబాద్ గచ్చిబౌలి ఇనార్బిట్ మాల్ ఆధ్వర్యంలో 3వ ఎడిషన్ 10 కె రన్ వార్షికోత్సవాన్ని ఇవాళ నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రాంజన్ ప్రారంభించారు. ఈ రన్ లో దాదాపు 6000 మంది పాల్గొన్నారు. గత మూడు సంవత్సరల నుంచి రన్ ను నిర్వహిస్తున్నట్టు ఇనార్బిట్ మాల్ నిర్వహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంతో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ గురించి, రాష్ట్ర అభివృద్దిని తెలియజేస్తున్నామన్నారు. రన్ తో ఈ ఏడాది వరకు రూ.54 లక్షల ఫండ్ వచ్చిందని చెప్పారు. ఈ ఫండ్ తో సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపారు. ఈ పరుగులో విజేతగా గెలిచిన వారికి బహుమతులను అందజేశారు.