హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టే్ట్ కంపెనీల్లో, యాజమాన్యం నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్, చేవెళ్ల, షాద్ నగర్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
స్వస్తిక్ రియల్టర్ కంపెనీ,యాజమాన్యం నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. స్వస్తిక్ కంపెనీకి చెందిన కల్పన రాజేంద్ర,లక్ష్మణ్ నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ఉదయం నుంచే ఐటీ అధికారులు బృందాలుగా ఏర్పడి సిటీలోని షాద్ నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రైడ్స్ చేశారు.
ALSO READ : వాళ్లు దోచుకున్నారు.. మేం పంచుతున్నాం..
ఇటీవల షాద్ నగర్ లో స్వస్తిక్ కంపెనీ యాజమాన్యం భూమిని విక్రయం విషయంలో బ్యాలెన్స్ షీట్ లో వివరాలు చూపలేదని ఐటీ అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.