పొంగులేటి ఇండ్లల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు : శ్రీనివాసరెడ్డి పర్సనల్ రూమ్ కీని పగులగొట్టాలని నిర్ణయం

మాజీ ఎంపీ, పాలేరు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లలో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఉన్న రాఘవ ప్రైడ్ ఆఫీస్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 17లో ఉన్న 222/a ఇంట్లో,  పొంగులేటి బంధువు నందగిరిహిల్స్ లోని బంధువు ఇంట్లోనూ ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లో ఉన్న ఇంట్లో అన్ని రూమ్స్ చెక్ చేసి..  పలు కీలక డాక్యుమెంట్స్ ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

గురువారం (నవంబర్ 9) ఉదయం 5 గంటల నుండి ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్సనల్ రూమ్ లోనూ తనిఖీలు చేయనున్నారు. ప్రస్తుతం రూమ్ తాళాలు లేకపోవడంతో పొంగులేటి కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే.. పొంగులేటి కుటుంబ సభ్యులు ఆయన రూమ్ తాళాలు ఇవ్వకపోవడంతో... బ్రేక్ చేయాలని ఐటీ అధికారులు భావిస్తున్నారు.

ALSO READ: నేను డాలర్ని.. ఎక్కడైనా చెల్లుతా.. పువ్వాడ రద్దు చేసిన 2 వేల నోటు : తుమ్మల
 

హైదరాబాద్ లో ఇంకా ఐదు చోట్ల ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తమ కుటుంబ సభ్యులపై ఐటీ అధికారులు చేయి చేసుకున్నారంటూ పొంగులేటి ఆరోపించారు. తన అల్లుడుపై చేయి చేసుకున్నారని పొంగులేటి ఆరోపించారు. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ బలగాల మధ్య ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.