నల్లగొండ జిల్లా : తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక వనరులను కట్టడి చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఐటీ రైడ్స్ బీజేపీ వ్యూహంలో భాగమేనని అన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఐటీ రైడ్స్ పేరుతో మంత్రులను ఇబ్బంది పెడుతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం వైఖరి మార్చుకోవాలన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే.. అభివృద్ధి చేసి చూపించాలని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని హితవు పలికారు.