రాష్ట్ర వ్యాప్తంగా మరో సారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ తో పాటు 40 చోట్ల ఒకేసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బాలవికాస ఫౌండేషన్, క్రిస్టియన్ సొసైటీ సంస్థల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మెదక్, వరంగల్ లోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోని అల్వాల్, బొల్లారం, కీసర, జీడిమెట్ల, పటాన్ చెరు, తార్నాక, కూకట్ పల్లి సహా మరో 8 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
మొత్తం ఐటీ అధికారులు 20 బృందాలుగా విడిపోయిన సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . ఈ సంస్థల్లో పన్ను ఎగవేతకు సంబంధించిన పక్కా ఆధారాలతోనే సోదాలు చేస్తున్నట్లు సమాచారం.