రంగారెడ్డి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికు సమీస్తున్న సమయంలో హైదరాబాద్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ పరిధిలో పలువురు రాజకీయ నేతల ఇళ్లలో తెల్లవారు జాము నుంచే జరుగుతున్నాయి. బడంగ్ పేట్, నార్సింగ్, బంజారాహిల్స్, తుక్కుగూడ ప్రాంతాల్లో ఏకాకలంలో దాడులు నిర్వహించారు ఐటీ అధికారులు. కాంగ్రెస్ నాయకురాలు, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, బీఆర్ ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిపై ఏకకాలంలో ఐటీ సోదాలు జరిగాయి. ఎన్నికల వేళ ఐటీ దాడులతో రాజకీయ నేతల్లో ఆందోళన మొదలైంది.
గురువారం (నవంబర్ 2) ఉదయం 5 నుంచి బాలాపూర్ లోని కాంగ్రెస్ నేత పారిజిత నరసింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేప్టటారు. సోదాలు సమయంలో పారిజాత, ఆమె భర్త నరసింహారెడ్డి ఇంట్లో లేరు. ఆమె కూతురు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రస్తుతం మేయర్ పారిజాత తిరుపతిలోను, ఆమె భర్త నరసింహిరెడ్డి ఢిల్లో ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మహేశ్వరం టికెట్ ఆశిస్తున్నారు బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి.
బీఆర్ ఎస్ నేత వంగేటి లక్మారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. తెల్లవారు జామునే వంగేటి ఇంటికి చేరుకున్న ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. అయితే వంగేటి ఇంట్లో తక్కువ సమయం మాత్రమే సోదాలు చేసినట్లు సమాచారం.
మరోవైపు మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిపై కూడా ఐటీ రైడ్స్ జరిగాయి. రంగారెడి జిల్లా షాద్ నగర్ మండలం బహుదూర్ గూడ శివారులోని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఫాం హౌజ్ లో ఐటీ అధికారులు సోదాలు చేశారు.
హైదరాబాద్ లో పారిజాత, వంగేటి లక్ష్మారెడ్డి, కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఇళ్లలో భారీ బందోబస్తు మధ్య ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో ఎవరినీ లోనికి అనుమతించలేదు. ఎన్నికల సమయంలో ఐటీ సోదాలతో రాజకీయ నేతలు ఆయోమయంలో పడ్డట్టు తెలుస్తోంది.