జగిత్యాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కం ట్యాక్స్​ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐటీ తనిఖీలు!

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇన్ కం ట్యాక్స్​ఆఫీస్ లో గురువారం ఐటీ డిపార్ట్ మెంట్ హయ్యర్ ​ఆఫీసర్లు తనిఖీలు చేపట్టారు. జీఎస్టీ ఎగవేతకు సంబంధించిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు స్టేట్ ఆఫీసర్లు తెలిపారు. మెయిల్, ఫోన్ నెంబర్ మార్పుతో ఫేక్ బిల్లులు చెల్లించినట్టుగా అనుమానాలు రావడంతో ఎంక్వైరీ చేస్తున్నట్టు చెప్పారు. కొన్ని రద్దయిన సోసైటీల పేరుతో  ఫేక్ బిల్లుల ద్వారా విక్రయాలు జరిగినట్టుగా తెలుస్తోందని పేర్కొన్నారు. ఇంకా ఎంక్వైరీ పూర్తి కాలేదని ఈ విషయాన్ని లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. 

ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని హైదరాబాద్ లోని కమిషనర్ ఆఫీస్ కు శుక్రవారం రావాల్సిందిగా సూచించామన్నారు. అయితే,  ఈ స్కామ్ లో కీలక సూత్రధారిగా వ్యవహరించిన ఓ వ్యక్తి రూ.25 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ రైడ్స్ లో హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చిన డిప్యూటీ కమిషనర్లు వేణుగోపాల్, బాలాజీ, అసిస్టెంట్ కమిషనర్లు దేవేందర్, తిరుపతి తో పాటు కరీంనగర్ డివిజన్ జాయింట్ కమిషనర్, జగిత్యాల అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు.