శ్రీచైతన్య విద్యాసంస్థల్లో ఐటీ సోదాలు

శ్రీచైతన్య విద్యాసంస్థల్లో ఐటీ సోదాలు

శ్రీచైతన్య విద్యాసంస్థల్లో ఐటీ సోదాలు
మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కార్పొరేట్ ఆఫీస్ సహా దేశవ్యాపంగా రెయిడ్స్
పలు రికార్డులు స్వాధీనం.. నేడూ సోదాలు కొనసాగే అవకాశం! 

హైదరాబాద్: ప్రముఖ విద్యాసంస్థల ఆర్థికలావాదేవీలపై ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఫోకస్ పెట్టింది. ఆర్థిక సంవత్సరం, రాబోయే విద్యా సంవత్సరం నేపథ్యంలో ఫీజుల వసూళ్లు, ఐటీ చెల్లింపులపై ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా శ్రీచైతన్య విద్యాసంస్థల్లో సోమవారం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యప్ప సొసైటీలోని  శ్రీచైతన్య కార్పొరేట్ ఆఫీసు, ఏపీ, బెంగళూరు‌‌‌‌‌‌‌‌, చెన్నై, ఢిల్లీ, పుణే సహా దేశవ్యాప్తంగా ఉన్న  శ్రీచైతన్య విద్యాసంస్థల్లో సోమవారం తెల్లవారుజామున 6 గంటల నుంచి ఏకకాలంలో దాడులు చేసింది. కేంద్రబలగాల బందోబస్తు మధ్య సోదాలు జరిగాయి. మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కార్పొరేట్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో  నగదు, హార్డ్‌‌‌‌‌‌‌‌డిస్క్‌‌‌‌‌‌‌‌లు, పలు బ్యాంకులకు చెందిన రికార్డులను స్వాధీనం చేసుకుట్టు తెలిసింది. ఐదు రోజుల సెర్చ్‌‌‌‌‌‌‌‌ వారెంట్‌‌‌‌‌‌‌‌తో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

ఐదేండ్ల ఐటీ చెల్లింపులపై ఆరా..

శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన గత ఐదు సంవత్సరాల ఐటీ చెల్లింపుల వివరాలతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఫీజుల పెంపుతో పాటు అధిక మొత్తంలో అనధికారిక లావాదేవీలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇందులో రెండు విధానాలను అవలంబిస్తున్నట్టు ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పించుకునే క్రమంలో అధికశాతం ఫీజులను నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారని, అతి తక్కువ శాతం మాత్రమే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ పేమెంట్ విధానంలో వసూలు చేస్తున్నారని ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఇలా వసూలు చేసిన ఫీజులకు సంబంధించి ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేసినట్లు ఐటీ సోదాల్లో బయటపడినట్టు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం కూడా తనిఖీలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.