మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని రైస్ మిల్లులపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. రెండో రోజైనశుక్రవారం యాద్గార్ పల్లి పరిధిలోని ఆర్ఎస్వీ, సాంబ శివ, సూర్య, వైష్ణవి, సాయి జయలక్ష్మి రైస్ మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేశారు.
ధాన్యం స్టాక్ ఇతర రికార్డులను పరిశీలించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆరు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. గతనెలలోనూ ఇక్కడి రైస్ మిల్లులు, మిల్లర్ల ఇండ్లపై ఐటీ ఆఫీసర్లు దాడులు చేశారు. ఇక్కడి నుంచే హైదరాబాద్, కర్నాటక సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు రైస్ ఎగుమతి జరుగుతోంది. అయితే జీఎస్టీ, ఐటీ, ఇతర పన్నుల చెల్లింపుల విషయంలో మిల్లర్లు అక్రమాలకు పాల్పడడంతో ఐటీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం.