హైదరాబాదులో ఐటీ దాడులు..ఏకకాలంలో 30 ప్రాంతాల్లో తనిఖీలు

హైదరాబాదులో ఐటీ దాడులు..ఏకకాలంలో 30 ప్రాంతాల్లో తనిఖీలు

హైదరాబాద్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. కొల్లూరు, రాయదుర్గంలో ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు చేశారు. గురువారం ( అక్టోబర్ 17) ఉదయం నుంచి  హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఏకకాలంలో 30చోట్ల తనిఖీలు చేశారు.గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విల్ బిల్డర్స్ లో సోదాలు చేశారు.బొప్పన్న శ్రీనివాసరావు, బొప్పన్న అచ్యుతరావు, బొప్నన్న అనూప్ ఇళ్లలో తనిఖీలు చేశారు. తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.