మ్యాంగో మీడియా సంస్థలో ఐటీ సోదాలు

మ్యాంగో  మీడియా సంస్థలో ఐటీ సోదాలు

హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. జనవరి 21న ఉదయం నుంచి మొత్తం 55 బృందాలుగా 8 చోట్ల.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్  ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. ప్రముఖ  ప్రొడ్యూసర్ దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసు,  సింగర్ సునీత భర్త రాముకు చెందిన మ్యాంగో టీవీ మీడియా సంస్థ,  భాగస్వాముల ఇళ్లు్, ఆఫీసుల్లో  సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక డ్యాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు.

దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.  మంగళవారం (21 జనవరి) ఉదయం దిల్ రాజు సోదరుడు, కుమార్తె, బందువుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.  జంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.  రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్ సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.  

Also Read : మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

మరో వైపు ప్రముఖ  నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ సోదాలు  జరుగుతున్నాయి.  నిర్మాతలు నవీన్, మైత్రీ మూవీస్  సీఈవో చెర్రీ ఇళ్లు,ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. మైత్రీ సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి.మైత్రీ మూవీస్ పుష్ఫ 2 నిర్మించింది. అల్లు అర్జున్ నటించిన  ఈ మూవీ ఇండియాలోనే  సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది