బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుని ఇంట్లో ఐటీ సోదాలు

హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.  బీఆర్ఎస్ నేత,  జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరునితో పాటు అతని బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 60 టీములతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా హైదరాబాద్‌లో ఐటీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు భారీ స్థాయిలో ఐటీ టీమ్‌లు రంగంలోకి దిగడం చర్చనీయాంశం అయ్యింది.  దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.