మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

మైత్రీ మూవీ మేకర్స్  కార్యాలయాల్లో ఐటీ సోదాలు

హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. జనవరి 21న ఉదయం నుంచి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, మైత్రీ మూవీస్ సంస్థ ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.  55 బృందాలుగా అధికారులు 8 చోట్ల సోదాలు చేస్తున్నాయి.  గచ్చిబౌలి,హైటెక్ సిటీ, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.  

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని మైత్రి మూవీస్ ఆఫీసులో   ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.  నిర్మాతలు మైత్రీ నవీన్, మైత్రీ మూవీస్  సీఈవో చెర్రీ ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. మైత్రీ సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. అటు దిల్ రాజు,ఆయన కూతురు, బంధువుల ఇళ్లు, ఆఫీసుల్లోనూ ఇవాళ ఉదయం నుంచే (జనవరి 21) సోదాలు కొనసాగుతున్నాయి.

మైత్రీ మూవీస్ పుష్ఫ 2 నిర్మించింది. అల్లు అర్జున్ నటించిన  ఈ మూవీ ఇండియాలోనే  సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. బాహుబలి వసూళ్లను బ్రేక్ చేసి.. అతి తక్కువ రోజుల్లోనే రూ. 1800 కోట్లకు పైగా వసూలు సాధించిన  మూవీగా రికార్డ్ సృష్టించింది.  ఈ మూవీ ఇంకా కొన్ని థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.