పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. 8 వాహనాల్లో వచ్చిన అధికారులు హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్, ఖమ్మంలోని ఆయన ఇళ్లు, ఆఫీసులపై ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఉదయం 3 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటి సిబ్బంది ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తనపై ఐటీ రైడ్స్ జరగవచ్చునని నిన్న పొంగులేటి కామెంట్ చేయగా ఈ రోజు తెల్లవారుజామునే అధికారులు రైడ్స్ చేయడం గమనార్హం. పొంగులేటి ఇళ్లు, ఆఫీసులపై ఐటీ రైడ్స్ జరుగుతుండటంతో ఆయన అనుచరులు మద్దతుగా పొంగులేటి ఇంటికి చేరుకుంటున్నారు. కాగా పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధిగా పొంగులేటి ఇవాళ నామినేషన్ వేయనున్నారు.
మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇండ్లల్లో బుధవారం ఎన్నికల అధికారులు, పోలీసులు సోదాలు జరిపారు. ఖమ్మం రూరల్ మండలం శ్రీసిటీ, అర్బన్‌లోని గొల్లగూడెంలో గల తుమ్మల నివాసాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సీ విజిల్ యాప్ లో అందిన ఫిర్యాదు మేరకే తనిఖీలు చేశామని వారు తెలిపారు.