శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ దాడులు.. రిసీట్ ఇవ్వకుండా లక్షల్లో ఫీజుల వసూలు

శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ దాడులు.. రిసీట్ ఇవ్వకుండా లక్షల్లో ఫీజుల వసూలు

శ్రీచైతన్య కాలేజీలపై ఆకస్మిక సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. సోమవారం ( మార్చి 10 ) దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య విద్యాసంస్థలపై సోదాలు నిర్వహించారు అధికారులు. రిసీట్ ఇవ్వకుండా స్టూడెంట్స్ నుంచి ఫీజులు వసూలు చేసి పెద్దఎత్తున ట్యాక్స్ ఎగ్గొటినట్లు గుర్తించిన అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ లోని  మాధాపూర్ శ్రీచైతన్య కాలేజీ హెడ్ క్వార్టర్ లో సోదాలు నిర్వహించిన అధికారులు పెద్ద ఎత్తున అక్రమ లావేదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.

ALSO READ | మా గోడు పట్టించుకోండి సారూ.. అక్షర చిట్ ఫండ్స్ మోసం.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు

 తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలోని శ్రీచైతన్య కాలేజీలలో ఐటీ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఐటీ సోదాల గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. స్టూడెంట్స్ నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ కాలేజీలకు ఈ ఐటీ సోదాలు వార్నింగ్ అనే చెప్పాలి. తమ నుండి అక్రమంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్.