నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు

నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం (21 జనవరి) ఉదయం దిల్ రాజు సోదరుడు, కుమార్తె, బందువుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.  

ఐటీ అధికారులు మొత్తం 55 బృందాలుగా విడిపోయి  హైదరాబాద్ లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. జంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.

రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్ సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.