పొలిటికల్ లీడర్లు,వ్యాపారులు, వారి వారి బంధువుల ఇళ్లు,ఆఫీసుల్లోనూ ఐటీ దాడులు సహజం. ఆదాయపు లెక్కల్లో తేడాలు, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు, హవాలా మార్గంలో డబ్బు మళ్లింపు తదితరాలపై పక్కా సమాచారంతో ఎవరిపైనైనా, ఎక్కడైనా సోదా చేస్తారు. ఇందులో సహజంగా పక్షపాతానికి తావుండదు. ఇటీవలి రైడ్స్ దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గడచిన ఆరు నెలల్లో ఏకంగా 15 మంది ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయగా అధికార పార్టీకి చెందిన ఒకే ఒక్క నాయకుడి నివాసంలోనే తనిఖీలు చోటు చేసుకున్నాయి.
ఈ మధ్య కాలంలో అపొజి షన్ పార్టీల లీడర్లపైనే వరసపెట్టి దాడులు చేస్తున్న ఆదాయపు పన్నుశాఖ అధికారులు వెరీ రీసెంట్‌గా గల్లా జయదేవ్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. ఇండస్ట్రియలిస్ట్, అమర రాజా గ్రూపు ఎండీ అయిన జయదేవ్..గుంటూరు ఎంపీ కూడా. తెలుగుదేశం పార్టీ తరఫున మరోసారి బరిలో నిలబడి అదృష్టం పరీక్షించుకున్నారు. నాలుగేళ్ల పాటు ఎన్డీఏలో పార్ట్‌నర్ గా ఉన్న టీడీపీ ఏడాది క్రితం బయటకొచ్చింది. అప్పటినుంచి.. మోడీ సర్కారు ఏపీకి చేసిందేమీ లేదంటూ విమర్శిస్తూనే ఉంది. దీంతో పాటు ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లోనూ జయదేవ్ పోటీ చేసిన నేపథ్యంలో ఈ రైడ్స్ జరిగాయి. ఈ ఒక్క చోటనే కాదు, చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ,ప్రతిపక్ష నాయకులు బలంగా ఉన్నచోట దాడులు జరుగుతున్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. కేంద్రం కావాలనే ఐటీ సోదాలు చేయిస్తోందనే భావన నెలకొం ది. జనరల్ ఎలక్షన్స్ ని ప్రభావితం చేయటానికే ప్రధాని మోడీ ప్రయత్నిస్తు న్నట్లు గా భావిస్తున్నారు.ఆ ఉద్దేశం లేకపోతే ఎన్‌డీఏలోని దాదాపు 40 పార్టీలకన్నా టీడీపీ, కాం గ్రెస్ తదితర పార్టీలనే ఎందుకుటార్గెట్ చేస్తారు? పవర్ లో ఉన్న కమలనాథుల వ్యవహార శైలి ఎమర్జెన్సీ కి అద్దం పడుతోంది. అపొజి షన్పార్టీల నేతలపై ఐటీ దాడుల వెనక కేం ద్ర ప్రభుత్వ పెద్దల రాజకీయ ప్రయోజనాలు ఉన్నా యని పలు రాష్ట్రాల సీఎంలు చెబుతున్నా రు. ఆవేశంతో అంటున్నఈ వ్యా ఖ్యల్లో నిజం లేకపోలేదు.
గత ఆరు నెలల్లో 15మంది ప్రతిపక్ష లీడర్లపై ఐటీ సోదాలు జరగటమే తిరుగులేని ఉదాహరణ. ఈ దాడులన్నీ గతేడాది చివరలోఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాకనే జరగడం గమనార్హం.నాటి ఎన్నికల్లో బీజేపీ చేతిలో నుంచి మధ్యప్రదేశ్ , రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాలను కాం గ్రెస్ దక్కించుకుంది. జనరల్ ఎలక్షన్లకు సెమీఫైనల్‌గా ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికలను లెక్కలోకి తీసుకున్నారు. సెమీఫైనల్స్‌లోఓడిపోవడంతో ఫైనల్స్‌లో ఏమవుతుందో అనే బెంగ ఎక్కువైనందువల్లే ఇలాంటి దాడులకు సాహసిస్తోందన్న వాదన వినిపిస్తోంది. అధికార బీజేపీకి చెందిన ఒకే ఒక్క లీడర్ (ఉత్తరాఖండ్ ) ఇంటిపైనే ఆదాయపుపన్ను అధికారులు దాడి చేశారు. వాళ్ల పక్షపాతానికి ఇంతకన్నా రుజువేం కావాలన్నది ప్రతిపక్షాల ప్రశ్న.మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ అనుచరుల ఇళ్లల్లోఈ నెల 7న ఐటీ దాడులు జరిగాయి. ఏపీలో టీటీడీచైర్మన్ , టీడీపీ మైదుకూరు అసెంబ్లీ క్యాండిడేట్ పుట్టా సుధాకర్ యాదవ్ నివాసాల్లోనూ, అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లోనూ ఈ నెల5న ఆదాయపు పన్ను ఆఫీసర్లు సోదాలు చేశారు.గతంలో ‘మోడీ నియంత’ అని డీఎంకే చీఫ్ స్టాలిన్ విమర్శిం చారు. ఫలితంగా తమిళనాడులో ఆ పార్టీ ట్రెజరర్ , కట్పాడి ఎమ్మెల్యే దురై మురుగన్ ఆఫీసుల్లో;ఆయన కుమారుడు డీఎం కదిర్ ఆనంద్ నడిపే సంస్థల్లో మార్చి 29న ఐటీ రైడ్స్ నిర్వహించారు. జేడీఎస్–కాం గ్రెస్ అలయెన్స్ అధికారంలో ఉన్న కర్ణాటకలోమార్చి 27, 28న ఐటీ అధికారులు దాడులు చేశారు.మైనర్ ఇరిగేషన్ మంత్రి పుట్టరాజును టార్గెట్ గా చేసుకున్నారు.
సీఎం కుమార స్వామికి అన్నయ్య, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ మంత్రి హెచ్ డీ రేవణ్ణ ఇళ్లపైనా,ఆఫీసులపైనా దాడులు నిర్వహించారు. యూపీలోబీఎస్పీ హైకమాం డ్ మాయావతికి అసిస్టెంట్ అయిన నెత్ రామ్ ఇంట్లో మార్చిలో ఐటీ తనిఖీలు నిర్వహిం చారు. గత ఆరు నెలల్లో ‘ఆప్’ లీడర్లు కైలాష్ గెహ్లట్ ,నరేష్ బాల్యన్ నివాసాల్లోనూ దాడులు జరిగాయి.అందుకే, ఈ ఐటీ రైడ్స్ ని ‘సెలెక్టివ్ సెర్చెస్ ’గా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తేల్చేశారు. ప్రతిపక్షనాయకులపై ప్రతీకారం తీర్చు కోటానికే బీజేపీ ఇలాగేమ్స్ ఆడుతోందని కర్ణాటక సీఎం కుమారస్వామిమండిపడ్డారు. లోక్ సభ పోలిం గ్ దృష్ట్యా అపొజి షన్పార్టీల పై అపోహలు పెంచటానికి రూలింగ్ పార్టీ ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీలను సైతం వాడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ.. ఎలక్షన్ కమిషన్ (ఈసీ)కి ఫిర్యా దు చేయక తప్పలేదు. దీనిపై స్పందించిన ఈసీ.. తమ అనుమతి లేకుం డా దాడులు చేయొద్దని సీబీడీటీ, ఐటీఆఫీసర్లకు చెప్పటం స్వాగతిం చాల్సిన పరిణామం.అయితే, గురువారం తొలి విడతలో బీజేపీకి అంతగాపట్టులేని ప్రాంతాల్లో లోక్ సభ ఎన్ని కలు జరిగాయి.తెలంగాణ, ఆంధ్రపదేశ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో నిలోక్‌సభ స్థానాల భవిషత్తు ఈవీయంల్లో భద్రంగా ఉంది. ఇక మీదట జరగబోయే ఆరు విడతల్లోనూబీజేపీకి చాలా కీలక రాష్ట్రాలున్నాయి.
దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఐటీ రైడ్స్ జరిగాయి.
రాష్ట్రం ఎన్ని దశల్లోపోలింగ్ ఐటీదాడులు
కర్ణాటక 2 5
తమిళనాడు 1 3
ఆంధ్రప్రదేశ్ 1 2
ఢిల్లీ 1 2
మధ్యప్రదేశ్ 4 1
ఉత్తరప్రదేశ్ 7 1
జమ్మూకా శ్మీర్ 5 1