వైదేహి టౌన్ షిప్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వైదేహి టౌన్ షిప్ లో ప్రముఖ కాంట్రాక్టర్, రైస్ మిల్లర్  వింజం శ్రీధర్  నివాసంతో ఆయన  ఆఫీసుల్లో ఐటీ సోదాలు శుక్రవారం కూడా కొనసాగాయి. అలాగే మిర్యాలగూడ పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ రైస్ మిల్లర్లు బండారు కుశలయ్య, రంగా శ్రీధర్, రంగా రంజిత్, పాల అంతయ్యకు చెందిన రైస్  మిల్లుల్లో కూడా ఐటీ అధికారులు రెండో రోజు తనిఖీలు కొనసాగించారు. ఆయా వ్యాపారుల బ్యాంకు ఖాతాలతో పాటు లాకర్లలో దాచి ఉంచిన బంగారం, నగదు, కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్కుల్లోని డేటాను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 16న  తెల్లవారుజామున 4 గంటల నుంచి సుమారు 40 మంది ఐటీ అధికారులు నాలుగు టీములుగా ఏర్పడి తనిఖీలు చేపడుతున్నారు.