మాజీ మంత్రి జానారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఐటీ రైడ్స్ సంచలనం రేపుతున్నాయి. ఐటీ అధికారులు 2023 నవంబర్ 02 రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేపట్టారు. రెండవ రోజు(నవంబర్ 03) కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు(నవంబర్ 03) కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. 

జానారెడ్డి తనయుడు, నాగర్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. 

ALSO READ : బీజేపీ, బీఆర్​ఎస్​ రెండూ ఒక్కటే : చంద్ర కుమార్, మురళి

అదేవిధంగా మహేశ్వరం నియోజవర్గ కాంగ్రెస్ నేత పారిజాత నర్సింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ ఇంట్లో రెండవ రోజు తనిఖీలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో కాంగ్రెస్ నేతలకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో 18 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు.