డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు : ఎయిర్ పోర్ట్ నుంచి వెనక్కి పిలిచిన అధికారులు

డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు : ఎయిర్ పోర్ట్ నుంచి వెనక్కి పిలిచిన అధికారులు

హైదరాబాద్ లో  రెండు రోజులుగా టాలీవుడ్ ప్రముఖులు, వాళ్ల బంధువుల ఇళ్లు,ఆఫీసులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి దిల్ రాజు, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా సంస్థల కార్యాలయాలపై ఐటీ సోదాలు చేస్తోంది. 

ఇవాళ  (జనవరి 22)   పుష్పా 2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలో  ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.  ఎయిర్ పోర్టు నుంచి సుకుమార్ ను నేరుగా ఇంటికి తీసుకెళ్లారు ఐటీ అధికారులు.  పుష్ఫ 2 సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ ,ఆదాయ వివరాలను ఆరాదీస్తున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. 

ప్రస్తుతం ఐటీ సోదాలు చేస్తున్న ఈ  ప్రొడ్యూసర్స్  చిత్రాలు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సాధించాయి. దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన   సంక్రాంతికి వస్తున్నాం మూవీ హిట్ కొట్టింది. అలాగే  మైత్రీ మూవీస్ నిర్మించిన పుష్ఫ2 దేశ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.