యూట్యూబర్‌‌‌‌‌‌‌‌ ఇంట్లో ఐటీ సోదాలు

ఉత్తరప్రదేశ్‌‌‌‌ బరేలీలో ఘటన


న్యూఢిల్లీ: యూట్యూబ్‌‌‌‌ చానల్‌‌‌‌ ద్వారా కోటి రూపాయలు సంపాదించిన ఉత్తరప్రదేశ్ యూట్యూబర్‌‌‌‌‌‌‌‌ ఇంటిపై ఇన్‌‌‌‌కం ట్యాక్స్‌‌‌‌ అధికారులు సోదాలు చేశారు. సోదాల్లో అతని ఇంట్లో రూ.24 లక్షలను గుర్తించారు. యూపీలోని బరేలీకి చెందిన యూట్యూబర్‌‌‌‌‌‌‌‌ తస్లీమ్‌‌‌‌ గత కొన్నేండ్లుగా షేర్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌కు సంబంధించిన వీడియోలతో ఓ యూట్యూబ్‌‌‌‌ చానల్‌‌‌‌ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఇల్లీగల్‌‌‌‌గా కోటి రూపాయలు సంపాదించాడని ఐటీ అధికారులు చేసిన ఆరోపణలను తస్లీమ్‌‌‌‌ కుటుంబసభ్యులు కొట్టిపారేశారు. నిందితుడి బ్రదర్‌‌‌‌‌‌‌‌ ఫిరోజ్‌‌‌‌ మాట్లాడుతూ..  తన తమ్ముడు ఎలాంటి తప్పు చేయలేదన్నాడు. యూట్యూబ్‌‌‌‌ చానల్‌‌‌‌ ద్వారా వచ్చి రూ.1.2 కోట్లకు సంబంధించి రూ.4 లక్షల ట్యాక్స్‌‌‌‌ను కట్టామని తెలిపాడు. ‘‘మేము ఎలాంటి తప్పు చేయడం లేదు. యూట్యూబ్‌‌‌‌ చానల్‌‌‌‌ను రన్‌‌‌‌ చేస్తున్నాం. దాని ద్వారా మంచి ఇన్‌‌‌‌కం సంపాదిస్తున్నాం. ఇది నిజం. కావాలనే మాపై ఒక పద్ధతి ప్రకారం కుట్ర చేస్తున్నారు” అని ఫిరోజ్‌‌‌‌ పేర్కొన్నాడు. తన కొడుకును కావాలనే ఈ కేసులో ఇరికించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని తస్లీమ్‌‌‌‌ తల్లి ఆరోపించారు.

ALSO READ:వచ్చె నెల 18 వరకు ‘నిమ్స్’ టెండర్ల గడువు